GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 7:07 pm Digital Edition : GURU SWAMY

తొత్తులుగా పనిచేసి తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళమీద కోర్టులో పరువు నష్టం కింద ఒక్కొక్కడు కోటి రూపాయలు చెల్లించాలని సూట్ వేసి, వాళ్లకు నోటీసులు పంపిన AB వెంకటేశ్వరా

*తొత్తులుగా పనిచేసి తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళమీద కోర్టులో పరువు నష్టం కింద ఒక్కొక్కడు కోటి రూపాయలు చెల్లించాలని సూట్ వేసి, వాళ్లకు నోటీసులు పంపిన AB వెంకటేశ్వరావు*

AB వెంకటేశ్వర రావు పంపిన ఈ నోటీసులను ఎక్కువ మంది మెచ్చుకుంటున్నారు.

ఈయన నోటీసులు పంపిన వాళ్ళలో మొన్ననే జైలుకు పోయిన పూడి శ్రీహరి, అప్పటి డీజీపీ గౌతం సవంగ్, సునీల్ కుమార్, RP ఠాకూర్, రవిశంకర్ అయ్యంగార్, విజయ్ పాల్, గోవింద రాజులు, PSR ఆంజనేయులు, కొల్లి రఘురామ రెడ్డి లు ఉన్నారు.

ఎలాంటి తప్పులు చెయ్యకపోయినా వివేకా హత్యలో తుడిచేసిన సాక్షాలు పట్టించాడు అనేది వాళ్ళ కున్న ద్వేషం, దీనితో లేని అభియోగాలు మోపి ఆయనను సస్పెండ్ చేస్తే, న్యాయపోరాటం చేసి తెచ్చుకున్న పోస్టింగ్ ఇవ్వకుండా నరకం చూపెట్టారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులు తొలగించి ఏదో నామినేటెడ్ పదవి ఇచ్చినప్పటికీ ఈయన తిరస్కరించారు.

జగన్ తో అంటకాగి ఈ ప్రజల సొమ్ము జీతం తీసుకుని ప్రజల కోసం పనిచేయడం మానేసి జగన్ కోసమే పనిచేసిన ఈ అధికారులను కోర్టుల చుట్టూ తిరిగేలా మంచి పని చేశారు ABV అని అందరూ ప్రశంశిస్తున్నారు.