తొలి ఏడాదిలోనే ‘ఎస్.వి జూనియర్ కళాశాల’ స్టేట్ ర్యాంకుల ప్రభంజనం!
పలమనేరు, జూన్ 19 ( గరుడ ధాత్రి ) : స్థాపించిన మొదటి సంవత్సరంలోనే పలమనేరు విద్యా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్.వి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు (స్టేట్ ర్యాంక్), పలమనేరు టౌన్ ఫస్ట్ సాధించి కళాశాల ప్రతిష్టను రాష్ట్రస్థాయిలో చాటారు. సిఇసి గ్రూప్ నందు విద్యార్థిని శ్రీ గీత 500 మార్కులకు గాను 495 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులతో పాటు టౌన్ టాపర్‌గా నిలిచింది. అదే గ్రూప్‌లో ఇమ్రాన్ భాష 486...