తోతపురి మామిడికి కేజీకి కేవలం రూ.3 మాత్రమే..!

కూలీలు, పిచికారీ మందులు, రవాణా ఖర్చులు కూడా రాక రైతుల ఆందోళన. గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి. చిత్తూరు జిల్లాలో తోతపురి మామిడి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది తోతపురి మామిడి పండ్లకు మార్కెట్లో కేవలం కిలోకు రూ.3 మాత్రమే ధర లభిస్తుండటంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం వస్తున్న ధరలు సాగు ఖర్చులకు కూడా సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి తోటల నిర్వహణ కోసం సీజన్ మొత్తం పిచికారీ...