తోతాపురి మామిడి రైతులకు కోలుకోలేని దెబ్బ
-పది రోజుల్లోనే సగానికి పడిపోయిన ధరలు! పలమనేరు, జూన్ 18 ( గరుడ ధాత్రి ) : సీజన్ ప్రారంభంలోనే తోతాపురి మామిడి రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పదిహేను రోజుల క్రితం మార్కెట్లో కిలో రూ. 6 నుంచి రూ. 8 వరకు పలికిన ధర.. కేవలం పది రోజుల్లోనే సగానికి పడిపోయింది. ప్రస్తుతం కొన్ని రాంపుల్లో (మార్కెట్ కేంద్రాల్లో) కిలో కేవలం రూ. 2 నుంచి రూ. 4 మాత్రమే పలుకుతుండటంతో తోటల యజమానులు, రైతులు లబోదిబోమంటున్నారు. మామిడి పంట సాగు...