త్రాగునీటి ట్యాంకు మెట్లు దెబ్బతిని ప్రజలకు ముప్పు
త్రాగునీటి ట్యాంకు మెట్లు దెబ్బతిని ప్రజలకు ముప్పు -తక్షణ మరమ్మతులు చేపట్టి ట్యాంకును శుభ్రపరచాలని టీడీపీ డిమాండ్ గరుడధాత్రిన్యూస్ : నాగలాపురం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉన్న త్రాగునీటి ట్యాంకు మెట్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాంకును శుభ్రపరిచే పరిస్థితి లేకపోవడంతో ప్రజలకు సరఫరా అవుతున్న త్రాగునీరు కలుషితమై, సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల...