GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 5:07 am Digital Edition : GURU SWAMY

దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యం – సీఎం చంద్రబాబు…

దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచి అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు మధ్య కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై మధ్య మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, విశాఖ–విజయవాడ మెట్రోలకు కేంద్ర సహకారం అవసరమని తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా తమిళనాడు నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.