దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్‌వో గా వై. బాలాజీ కిరణ్

గరుడధాత్రి 2013 బ్యాచ్‌కు చెందిన భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS) అధికారి వై. బాలాజీ కిరణ్ దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway) ప్రధాన ప్రజా సంబంధాల అధికారి (CPRO)గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.శ్రీ బాలాజీ కిరణ్ నవంబర్ 2025 నుంచి దక్షిణ కోస్తా రైల్వేలో డిప్యూటీ జనరల్ మేనేజర్-కమ్-సెక్రటరీ టు జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భారతీయ రైల్వేల్లో ట్రాఫిక్, కమర్షియల్ విభాగాల్లో విశేష అనుభవం కలిగిన ఆయన గుంతకల్ డివిజన్‌లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్‌గా, సికింద్రాబాద్ మరియు...