దగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి అమలుపై నేడు టౌన్‌హాల్ సమావేశం
సోమల, ఆగస్టు 2 ( గరుడ ధాత్రి న్యూస్ ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు దగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3వ తేదీన పుంగనూరులో టౌన్‌హాల్ సమావేశం నిర్వహించనున్నట్లు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు సి. లక్ష్మీపతి రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు పుంగనూరులోని జేఎండీ ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరగనుందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆదేశాల...