GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 9:28 am Digital Edition : GURU SWAMY

దళితుల సమస్యలపై ఈనెల 24 న జరిగే చలో కలెక్టరేట్ కు తరలిరండి.

నాగలాపురం ఆగస్టు 22 గరుడధాత్రి :

సామాజిక శంఖారావం పేరుతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో గత నెలలో దళిత గ్రామాల్లో చేసిన సర్వేలో వచ్చిన సమస్యలపై ఈనెల 24వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మెలుగు రమేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సామాజిక శంఖారావం ప్రచార యాత్రను మండల కేంద్రమైన నాగలాపురం సుందరయ్య కాలనీ వద్ద ఆటో ప్రచార యాత్రను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ దళితులు అభివృద్ధికి దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దళితులకు కొన్ని గ్రామాల్లో ఆలయ ప్రవేశం లేదని వారిని అంటరానివారుగా చూస్తున్నారని తెలిపారు. దళిత గ్రామాలలో కొన్నిచోట్ల స్మశానాలే లేవని ఉన్నచోట్ల దారులు లేవని దళితుల తమ సర్వే బృందాల వద్ద వాపోయినట్లు తెలిపారు. దళిత కాలనీలో అభివృద్ధికి నోచుకోక దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. దళిత కాలనీలలో వీధిలైట్లు లేవు సిమెంట్ రోడ్లు లేక డ్రైనేజీ కాలువలు లేక త్రాగునీరు లేక అల్లాడుతున్నారని తెలిపారు. పెరుగుతున్న జనాభా వల్ల ఇంటి స్థలాలు లేక ఒక ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉండలేని పరిస్థితి చూస్తే ఆందోళన కలిగిస్తుందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదు అని తెలిపారు. దళిత డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ప్రభుత్వం ఆపేసిందని తక్షణమే ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి, పింఛన్ 7000 రూపాయలకు పెంచాలని, ప్రతి కుటుంబానికి మూడు సెంట్లు ఇంటి స్థలం, ఇల్లు నిర్మించుకోవడానికి ఆరు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జస్టిస్ పున్న య్య కమిషన్ సిఫారసులు మేరకు దళిత కాలనీలలో స్మశానం లేకపోతే ప్రభుత్వ భూమిని రెండు ఎకరాలు కేటాయించాలని, ప్రభుత్వ భూమి అందుబాటులో లేని పక్షంలో ఒక ఎకరం భూమి నైనా ప్రైవేట్ గా కొనుగోలు చేసి ఇవ్వాలని జీవో నెంబర్ 1235 ద్వారా స్మశాన లకు దారులు, స్మశాన స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. దళితులు ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వడం లేదని, సాగులో ఉన్న భూములను ఫారెస్ట్ అధికారులు వెళ్ళకూడదు అని ఆంక్షలు పెట్టే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 24వ తేదీ సోమవారం నాడు చలో కలెక్టరేట్కు పిలుపునిచ్చామని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సత్యవేడు మండల కార్యదర్శి కృష్ణయ్య కులవివక్ష ప్రత్యేక పోరాట సంఘం మండల అధ్యక్షులు మునుస్వామి, నాగలాపురం మండలం నాయకులు శ్రీవల్లి జీవా సుబ్బమ్మ బాలాజీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు