ఘనంగా స్వాగతం పలికిన టిడిపి నాయకులు.
కుప్పం,జులై 29 (గరుడ ధాత్రి న్యూస్):కుప్పం రూరల్ మండలం బాబు నగర్ లోని దశమేశ్వరి అమ్మవారిని ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మూడవరోజు బుధవారం బాబు నగర్ చేరుకున్నారు. ఆలయంలో నారా భువనేశ్వరి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చిన బాబు నగర్ గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తిని భువనేశ్వరి అభినందించారు.
ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణి, కనకరాజు, బీరప్ప, బాలు, రామప్ప, మాదేష్, ధనప్ప, పలని తదితరులు పాల్గొన్నారు. కాగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుప్పం మండలం చెక్కునత్తం గ్రామ టీడీపీ కార్యకర్త ఎస్.కుట్టి అపన్ కుటుంబసభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.