దశాబ్దాల సాగునీటి కల సాకారం: రూ.8.90 కోట్లతో తిప్పిరెడ్డిపల్లె ముదిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి శ్రీకారం
వైభవంగా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి *స్వయంగా జేసీబీ ఎక్కి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కలెక్టర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం గరుడ దాత్రి న్యూస్ జులై 29:-మైదుకూరు: మైదుకూరు నియోజకవర్గ వ్యవసాయ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించబడింది. ఎన్నో ఏళ్లుగా నీటి చుక్క కోసం, సాగునీటి కోసం ఎదురుచూస్తున్న తిప్పిరెడ్డిపల్లె, ముదిరెడ్డిపల్లె గ్రామాల రైతుల దశాబ్దాల నిరీక్షణకు నేటితో తెరపడింది. ఈ రెండు గ్రామాల రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే...