బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్28
బైరెడ్డిపల్లి పోలీసుస్టేషన్ లో బుధవారం శాస్త్రోక్తంగా దసరా పూజలు వేద పండితులు తిప్పచార్యులు చే నిర్వహించారు. ఈ సందర్భంగా హోమము, ఆయుధ పూజ చేపట్టారు.ఈ కార్యక్రమంలో పలమనేరు డి.ఎస్.పి.డేగల ప్రభాకర్ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బైరెడ్డిపల్లి పోలీసు సిబ్బంది ఆయనను పూలమాలలు వేసి శాలువతో సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పలమనేరు రూరల్ సి.ఐ.పరశురాముడు,ఎస్.ఐ.చందనప్రియ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.