GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 7:16 am Digital Edition : GURU SWAMY

దాడి కేసులో నిందితుడి అరెస్ట్

సత్యవేడు సెప్టెంబర్ 21 గరుడధాత్రి :

సత్యవేడు మండలం వానెల్లూరు బస్టాండ్‌ సమీపంలో జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బి. రాజేష్‌ను శ్రీ సిటీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని స్థానిక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించినట్లు శ్రీ సిటీ ఎస్‌ఐ ప్రియాంక తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2026 జూన్ 27న వానెల్లూరు బస్టాండ్‌ వద్ద సుమారు పది మంది వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో పాత కక్షల నేపథ్యంలో అరవింద్‌పై బి. రాజేష్ దాడి చేసి కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అరవింద్ చేతికి గాయమై, చేయి విరిగినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాడి కేసులో నిందితుడిగా ఉన్న బి. రాజేష్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ ప్రియాంక వెల్లడించారు.