GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 8:10 pm Digital Edition : GURU SWAMY

దాసుకుప్పంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు యువత ఘన స్వాగతం

సత్యవేడు ఆగస్టు 02 గరుడధాత్రి :

సత్యవేడు మండలం దాసుకుప్పం గ్రామంలో లోకయ్య రెడ్డి, రవి రెడ్డి, యాచంద్ర నాయుడు ఆధ్వర్యంలో సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం కు గ్రామ యువకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గ్రామానికి చేరుకోగానే పూలమాలలతో సత్కరించి ఘనంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ, సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేస్తున్న కృషికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఆయన నాయకత్వానికి తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొంటూ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సుందర రామిరెడ్డి, లోకయ్య రెడ్డి, రవి రెడ్డి, యాచంద్ర నాయుడు, శేఖర్, అక్బర్ భాషా, సూరి, నాగరాజు అడ్వకేట్, రామకృష్ణ, మాజీ సర్పంచ్ మాతయ్య, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారికి ఘన స్వాగతం పలికారు.