దాసుకుప్పంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు యువత ఘన స్వాగతం

సత్యవేడు ఆగస్టు 02 గరుడధాత్రి : సత్యవేడు మండలం దాసుకుప్పం గ్రామంలో లోకయ్య రెడ్డి, రవి రెడ్డి, యాచంద్ర నాయుడు ఆధ్వర్యంలో సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం కు గ్రామ యువకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గ్రామానికి చేరుకోగానే పూలమాలలతో సత్కరించి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ, సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేస్తున్న కృషికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఆయన నాయకత్వానికి తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. నియోజకవర్గ...