దాసుకుప్పంలో తారాస్థాయికి చేరిన వైఎస్సార్సీపీ ప్రచారం
ఇంటింటి ప్రచారంతో ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులు.. ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి సత్యవేడు, గరుడధాత్రి న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సత్యవేడు మండలంలో రాజకీయ సందడి నెలకొంది. నవంబర్ 5వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారానికి చివరి రోజు కావడంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా దాసుకుప్పం గ్రామంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఏవీఎం బాలాజీ రెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు జడ్పీటీసీ అభ్యర్థి ఆశాలత ఏబినైజర్, దాసుకుప్పం ఎంపీటీసీ అభ్యర్థి...