దీర్ఘకాల పార్టీ సేవకు తగిన గుర్తింపు ఇవ్వాలి – టిడిపి నేత సమాధి నాగరాజు
పార్టీ కోసం పదవులు నిర్వహించినా తగిన ప్రాధాన్యత దక్కలేదని సమాధి నాగరాజు వినతి టీడీపీ అధిష్ఠానానికి కీలక బాధ్యత కోసం విజ్ఞప్తి సత్యవేడు సెప్టెంబర్ 05 గరుడధాత్రి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సిద్ధాంతాలను విశ్వసిస్తూ, విద్యార్థి దశ నుంచి ప్రజా జీవితంలో కొనసాగుతూ, వివిధ పదవుల్లో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన తన రాజకీయ, సామాజిక అనుభవానికి ఇకనైనా తగిన గుర్తింపు కల్పించాలని టీడీపీ నాయకుడు, అడ్వకేట్ సమాధి నాగరాజు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించడంతో పాటు...