GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 6:46 pm Digital Edition : GURU SWAMY

దేవదొడ్డిలో కొనసాగిన డెంగ్యూ మాసోత్సవాలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై2
బైరెడ్డిపల్లి మండలం లోని తీర్థం పి.హెచ్.సి.పరిధిలోని దేవదొడ్డి గ్రామంలో గురువారం డెంగ్యూ మాసోత్సవాలు వైద్యాధికారిణి పద్మా వతి ఆదేశాల మేరకు కొనసాగింది.ఈ సందర్భంగా దేవడొడ్డి ఎం.పి.యు.పి. స్కూల్ నందు ర్యాలి, మరియు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈసందర్భంగా డిప్యూటీ ఆరోగ్య విద్య వైద్యాధికారిణి కాంతమ్మ మాట్లాడుతూ అధిక జ్వరం,కీళ్ళు,కండరాల నొప్పులు, చర్మం మీద ఎర్రటి గుర్తులు ఉన్న లక్షణాలు ఉన్న యెడల డాక్టర్ దగ్గర చూపించు కోవాలని, అలాగే రాత్రిపూట దోమతెరలు వాడాలని, ఇంటిదగ్గర నీరు నిల్వ నీయ కుండా చూసుకోవాలని , వారానికి ఒకసారి ఫ్రైడే డ్రై డే పాటించాలని పేర్కొన్నారు..ఈకార్యక్రమంలోసి.హెచ్.ఓ. బెబీ, ఏ.ఎన్.ఎం.వాణి ,ధరణి,ఉపాద్యాయులు, విద్యార్ధులుతదితరులు పాల్గొన్నారు.