దేవరకొండ పై సుబ్రమణ్యస్వామి కి శయనోత్సవం తో ముగిసిన ఆడికృతిక మహోత్సవం వేడుకలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు8 బైరెడ్డిపల్లి మండలం లోని నెల్లిపట్ల గ్రామంలో దేవరకొండ పై వెలిసివున్న శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయంలో శనివారం రాత్రి స్వామికి శయణోత్సవం నిర్వహించడంతో ఆడికృతిక మహోత్సవం వేడుకలు ముగిసింది.ఉదయం స్వామి కి పంచామృత అభిషేకం అర్చకులు సుబ్రమణ్యం శాస్త్రి బృందం చే కొనసాగింది. మధ్యాహ్నం శాస్త్రోక్తంగా 12 మంగళహారతులు కార్యక్రమం, వసంతోత్సవం చేపట్టారు.రాత్రి శ్రీ వల్లీ,దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామి ఉత్సవ మూర్తులకు పట్టువస్త్రాలు ధరింపచేసి విశేష అలంకారం చేపట్టి సంప్రదాయం ప్రకారం శయనోత్సవం వేడుకలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ...