GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 9:26 pm Digital Edition : GURU SWAMY

ద్రావిడ యూనివర్సిటీ ప్రజా సంబంధాల అధికారిగా డాక్టర్ ఎస్. నరేష్ నియామకం

కుప్పం,సెప్టెంబర్ 12 (గరుడ ధాత్రి న్యూస్):ద్రావిడ విశ్వవిద్యాలయ ప్రజా సంబంధాల అధికారి (పి అర్ ఓ) గా డాక్టర్ ఎస్. నరేష్ ను నియమిస్తూ రిజిస్టార్ ఆచార్య వి. కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పి ఆర్ ఓ రిజిస్టార్ నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. నరేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ప్రజా సంబంధాల అధికారిగా బాధ్యతలు అప్పగించిన విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. విశ్వవిద్యాలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను మరింత పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలియచేశారు.