GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 9:56 pm Digital Edition : GURU SWAMY

ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు

కార్వేటినగరం అక్టోబర్ 2(గరుడ దాత్రి న్యూస్): కార్వేటినగరంలో వెలసిన ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో ఉదయం ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు పెరుగు తేనె హరిద్రవం చందనం పసుపు తో కూడిన అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద రాహుకాలం పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. ఆలయం దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉభయ దాతలుగా కీర్తి ప్రియ గంగాధరం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి గౌతమ్ రాజు, ఉపాధ్యక్షులు రవి రెడ్డి, కోశాధికారి లక్ష్మీపతి మొదలియార్, ఉప కోశాధికారి సాయి రాయల్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.