ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన నారాయణవనం బ్రహ్మోత్సవాలు
ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన నారాయణవనం బ్రహ్మోత్సవాలు శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి దివ్య బ్రహ్మోత్సవాలకు శ్రీకారం సకల దేవతలను ఆహ్వానించిన ధ్వజారోహణ మహోత్సవం. తిరుపతి గరుడ ధాత్రి మే 28 : నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణ మహోత్సవంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య శుభ మిధున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద విశేష...