నకిలీ ఫోన్ కాల్స్ నమ్మి మోసపోవద్దు..!

-మున్సిపల్ కమిషనర్ రమణ రెడ్డి హెచ్చరిక పలమనేరు, జూన్ 17 ( గరుడ ధాత్రి ) : పలమనేరు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ నంబర్ 9440795840 నుండి వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని పురపాలక సంఘ కమిషనర్ రమణ రెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా సదరు మొబైల్ నంబర్ నుండి మున్సిపల్ అధికారులమంటూ ఫోన్లు చేస్తూ... ప్రాపర్టీ టాక్స్ (ఆస్తి పన్ను) మరియు ఇతర మునిసిపల్ చెల్లింపులు చేయాలంటూ ప్రజలను నమ్మిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని...