కార్వేటి నగరం ఆగస్టు 11 గరుడ దాత్రి న్యూస్.
కార్వేటినగరం మండలం, కత్తెరపల్లె: రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2025లో నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కార్వేటినగరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లెకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికై పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ప్రధానోపాధ్యాయులు చెంగల్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థుల్లో కుబేంద్ర, కారుణ్య,ఉదయభాను,శ్యామ్ ప్రసాద్ ఉన్నట్లు ఆయన తెలిపారు స్కాలర్‌షిప్‌కు ఎంపికైన ప్రతి విద్యార్థికి రాబోయే నాలుగు విద్యా సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ.12,000 చొప్పున, మొత్తం రూ.48,000/- ప్రభుత్వం నుంచి ఉపకార వేతనం లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.కత్తెరపల్లె పాఠశాల నుంచి ఒకేసారి నలుగురు విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ఉమాపతి, సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థులను పరీక్షకు సిద్ధం చేసి, మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని కూడా ప్రధానోపాధ్యాయులు, SMC చైర్మన్, సభ్యులు మరియు తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. ఎంపికైన విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని రానున్న సంవత్సరాల్లో పాఠశాల నుంచి మరింత మంది విద్యార్థులు వంటి ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.