బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై29
బైరెడ్డిపల్లి మండలకేంద్రం లోని దళితవాడ లో నెలకొన్న శ్రీ సల్లపురెమ్మ ఆలయంలో బుధువారం గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా పూజలు ను అర్చకులు నాగేంద్రస్వామి చే కొనసాగింది.ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని నాగలమ్మ అలంకారంలో తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయదార్లు, భక్తులు పాల్గొన్నారుభక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.