నాగలాపురంలో ఏడు ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా నాగలాపురం సెప్టెంబర్ 4 గరుడధాత్రి: తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కొరడా ఝళిపించారు. మండలంలోని అరుణానది నుంచి ఇసుకను తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లకు సంబంధించిన రికార్డులు, ఇసుక బిల్లులు, అనుమతులను పోలీసులు పరిశీలిస్తున్నారు. సరైన బిల్లులు, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం...