నాగలాపురంలో రక్షణ వ్యవస్థపై స్థానికుల ఆందోళన

పట్టపగలే వృద్ధురాలి ఇంట్లో చోరీ.. భౌతిక దాడి పనిచేయని నిఘా నేత్రాలు.. భద్రతపై స్థానికుల ఆందోళన నాగలాపురం, సెప్టెంబర్ 13, గరుడధాత్రి: తిరుపతి జిల్లా నాగలాపురం మండల కేంద్రంలో ప్రజల భద్రతపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం బజారు వీధిలో నివాసం ఉంటున్న 72 ఏళ్ల ఉష అనే వృద్ధురాలి ఇంట్లో పట్టపగలే చోరీ జరగడంతో పాటు ఆమెపై భౌతిక దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో మండల కేంద్రంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలోనే పట్టపగలు ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం...