నాగలాపురం మండల కార్యకర్తలకు మొండిచేయి – నామినేటెడ్ పదవుల కేటాయింపుపై బీజేపీ ఆగ్రహం
నాగలాపురం మండల కార్యకర్తలకు మొండిచేయి – నామినేటెడ్ పదవుల కేటాయింపుపై బీజేపీ ఆగ్రహం నాగలాపురం, ఏప్రిల్ 29, (గరుడధాత్రి న్యూస్): నాగలాపురం మండలంలోని క్షేత్రస్థాయి కార్యకర్తలను విస్మరించి, నామినేటెడ్ పదవులను ఏకపక్షంగా కేటాయించడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కూటమి విజయానికి అహర్నిశలు శ్రమించిన స్థానిక కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకుండా, కేవలం టీడీపీకి చెందిన వారికే పదవులు కట్టబెట్టడం అన్యాయమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా కార్యవర్గ సభ్యులు...