నాగలాపురం DT పిచ్చాటూరు MRO గా బదిలీ
నాగలాపురం మండల రెవెన్యూ కార్యాలయంలో DTగా పనిచేస్తున్న వై. చంద్రబాబును పిచ్చాటూరు MRO FACగా నియమిస్తూ శనివారం ఆదేశాలు అందాయి.
పిచ్చాటూరు MROగా ఆయన వెళ్లడంతో నాగలాపురంలో డిప్యూటీ తాసిల్దార్ పదవి ఖాళీ అయింది. ప్రస్తుతం కృష్ణాపురం కాలంజెరి గ్రామాలలో రీ సర్వే పనులు చంద్రబాబు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. రీ సర్వే పనులు ఆగకుండా చూడాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.