నాగిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానంపై అందరి దృష్టి..!

త్రిముఖ పోరు.. అత్తాకోడళ్ల మధ్య ఆసక్తికర పోటీ గెలుపెవరిది..? ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ! బైరెడ్డిపల్లి, అక్టోబర్ 28 గరుడదాత్రి న్యూస్: బైరెడ్డిపల్లి మండలంలోని నాగిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానం ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. అధికార టీడీపీ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మధ్య త్రిముఖ పోటీ నెలకొనడంతో ఈ స్థానం ఎవరిని వరిస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అధికార టీడీపీ అభ్యర్థి రాధ కిషోర్ గౌడుకు స్వయానా అత్త అయిన ఇరాల కృష్ణవేణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం...