నాగిరెడ్డి పల్లి లో 28,29 న జంగమ గురువు దేవర, ఆంకాళమ్మ ప్రత్యేక పూజలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్23 బైరెడ్డిపల్లి గ్రామ పంచాయితీ కి చెందిన నాగిరెడ్డీపల్లి లో ఈ నెల 28,29వ తేదీన జంగమ గురువు దేవర మరియు ఆంకాళమ్మ పూజలునిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.28 వ తేదీ ఆదివారం నాగిరెడ్డి పల్లి లోని గణపతి ఆలయంలో,మేలుపల్లి గంగమ్మ గుడి నందుపంచామృత అభిషేకం నిర్వహిస్తున్నారు. ఉదయం ఆంకాళమ్మ పూజ,కళస స్థాపన,జంగామ గురువు దేవర పూజ,హోమాలు కొనసాగుతుంది అని తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సోమేశ్వరస్వామి కల్యాణోత్సవం, రాత్రి స్వామివారి నందివాహనోత్సవం,లింగదీరులచే. విన్యాసాలు,29 సోమవారం ఉదయం 5గంటలకుఅగ్నిగుండ ప్రవేశం కార్యక్రమంలు జరుగుతుంది...