నాటు తుపాకీతో అన్నను కాల్చి చంపిన తమ్ముడు.. ఐదుగురు నిందితుల అరెస్ట్
భూవివాదాలు, కుటుంబ కక్షలే కారణం పలమనేరు, ఆగస్టు11 ( గరుడ ధాత్రి ) : పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం మారపల్లిలో సంచలనం సృష్టించిన సీ.జీ. శ్రీనివాసులు హత్య కేసు మిస్టరీని పోలీసులు విజయవంతంగా ఛేదించారు. భూ వివాదాలు, కుటుంబ కక్షల నేపథ్యంలో స్వయానా తమ్ముడే (సవతి తల్లి కొడుకు) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడితో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి హత్యకు ఉపయోగించిన నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ...