నాడు జేబులు కొల్లగొట్టిన వ్యవస్థ… నేడు అదే వ్యవస్థను శాసిస్తున్న కలెక్టర్

గరుడధాత్రి : గంధం చంద్రుడు గారు (IAS) తన చిన్ననాటి జ్ఞాపకాలను అక్షరీకరించిన "నా సర్టిఫికెట్ కథ" కేవలం ఒక వ్యక్తిగత అనుభవం కాదు. అది ఈ దేశంలో అణగారిన వర్గాల పిల్లలు చదువు కోసం, ఒక చిన్న కాగితం ముక్క కోసం పడే ఆవేదనకు, వ్యవస్థలోని అవినీతి కోరలకు అద్దం పట్టే ఒక సజీవ సాక్ష్యం. ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు గారు తన ఫేస్‌బుక్ వాల్ పై రాసుకున్న ఈ కథ చదువుతుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. వ్యవస్థలోని...