GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 6:02 pm Digital Edition : GURU SWAMY

నాదెండ్ల బ్రహ్మం చౌదరిని పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

కుప్పం,ఆగస్టు 08 (గరుడ ధాత్రి న్యూస్)
కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన వద్దకు సీఎం స్వయంగా వెళ్లారు. బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సేవలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడే ఉన్న వైద్యులకు సీఎం చంద్రబాబు సూచించారు.