నాయుడుపేట సెప్టెంబర్ 4 గరుడధాత్రి :
నాయుడుపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మండల మరియు టౌన్ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డి. కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు మరియు మండల స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటి నుండే సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి బూత్ లో పార్టీని బలోపేతం చేసి, కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నంబాకం హరికృష్ణ, జిల్లా కిసాన్ రైతు విభాగం అధ్యక్షులు జోగి వినోద్, నాయుడుపేట మండల అధ్యక్షులు తోప్పాని రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీను, సుధాకర్, వెంకట రమణయ్య తదితరులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.