నారాయణవనంలో ఘనంగా సైన్స్ ల్యాబ్స్ ప్రారంభోత్సవం

రూ.70 లక్షల వ్యయంతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్స్ నిర్మాణం నారాయణవనం, సెప్టెంబర్ 21 గరుడధాత్రి న్యూస్: విద్యార్థుల భవిష్యత్తుకు సైన్స్ విద్య ఎంతో కీలకమని, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడం ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం మరింత పెంపొందుతుందని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం మండల కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు రూ.70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సైన్స్ ల్యాబ్స్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. సత్యవేడు ఎమ్మెల్యే...