నారాయణవనం, నాగలాపురం ఆలయాల అభివృద్ధి పనులపై జేఈవో డా. ఎ. శరత్ సమీక్ష

భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే టీటీడీ లక్ష్యం : జేఈవో నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లను చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో కలిసి రెండు ఆలయాలను సందర్శించి, ఆలయాల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్దేశిత సమయానికి...