నారాయణవనం మండలంలో శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు కోనేటి సుమన్ కుమార్

నారాయణవనం, జూన్ 11 గరుడధాత్రి : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, చిత్తూరు ఉమ్మడి జిల్లాల జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు కోనేటి సుమన్ కుమార్ నారాయణవనం మండలంలోని పలు శుభకార్యాల్లో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. మండలంలోని భీమునిచెరువు గ్రామానికి చెందిన దొంగేలి మణి కుమారుడు దొంగేలి నవీన్ వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, కోనేటి సుమన్ కుమార్ నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కసిమిట్ట గ్రామానికి చెందిన కుట్టి గోవిందస్వామి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే...