GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:11 pm Digital Edition : GURU SWAMY

నారావారిపల్లె జన్మనిస్తే- రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కుప్పం

* కుప్పం బహిరంగ సభలో నారా చంద్రబాబునాయుడు వెల్లడి.
* వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
* త్వరలో కుప్పంలో విమానాశ్రయం.
* రౌడీ ఇజం చేస్తామంటే ఊరుకోం.
* యమ గాని పల్లి వద్ద రిజర్వాయర్.
* పథకాల లబ్దిదారులతో ముఖా ముఖి నిర్వహించిన సీఎం చంద్రబాబు.
* కుప్పం అభివృద్ధిపై స్థానికుల అభిప్రాయాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి.
* సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం కొనసాగుతుండగా మసీదులో అజా ప్రార్ధన.
* అజా ప్రార్థన వినిపించగానే తన ప్రసంగాన్ని మధ్యలో కొద్దిసేపు నిలిపి ప్రార్థన ముగిశాక ప్రసంగాన్ని కొనసాగించిన ముఖ్యమంత్రి.
కుప్పం,సెప్టెంబర్ 21 (గరుడ ధాత్రి న్యూస్): నారావారిపల్లె తనకు జన్మనిచ్చిందని, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కుప్పం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా సోమవారం కుప్పం కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.నారావారి పల్లె తనకు జన్మను ఇస్తే కుప్పం రాజకీయ జీవితాన్ని ఇచ్చిందన్నారు. ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే నాంది పలుకుతామన్నారు.
గడచిన రెండేళ్లలో రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. కుప్పాన్ని ఓ మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలన్నీ చేస్తున్నామన్నారు.హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు తీసుకువచ్చి 133 చెరువులను నింపామన్నారు.ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకున్నాయన్నారు.త్వరలో యామిగాని పల్లి, మనపల్లి ప్రాంతాల్లో రిజర్వాయర్లను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు.కుప్పంలో 550 పైగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను లిఫ్ట్ ఇరిగేషన్, పైపులైన్లతో అనుసంధానం చేస్తామన్నారు.పశుదాణాకు కూడా ఇబ్బంది లేకుండా కార్యాచరణ చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం, పీఎండీఎస్ విధానాల ద్వారా ఎల్ నినోను మన రైతులంతా ఎదుర్కోవాలన్నారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఉద్యాన పంటలను కూడా సాగు చేసేలా చర్యలు చేపట్టామన్నారు.
ఈ ఏడాది మన రిజర్వాయర్లలో తక్కువ నీరు ఉంది. మిగిలిన నీటిని సద్వినియోగం చేసుకోవాలి.చిరు ధాన్యాల పంటల ద్వారా తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే ఆస్కారం ఉంది.పశుపోషణ, పౌల్ట్రీ లాంటి అంశాలపై దృష్టి సారించటం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని రైతులు, మహిళలు సాధించే అవకాశం ఉంటుంది.
రెండు నెలల క్రితం పర్యటనకు వచ్చినప్పుడు కుప్పంలో రూ. 7939 కోట్ల విలువైన పనులు ప్రాజెక్టుల శంకుస్థాపన చేశాం. ఇప్పుడు మళ్లీ కుప్పం మున్సిపాలిటీలో రూ. 38 కోట్ల విలువైన ప్రభుత్వ పనులకు శంకుస్థాపన చేశాం. అలాగే రూ.289 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా భూమి పూజ నిర్వహించాం.రూ.3.30 కోట్ల సమగ్ర ఘన వ్యర్ధాల నిర్వహణ, మెటిరియల్ రికవరీ ప్లాంట్ ప్రారంభించాం.వ్యవసాయ ఫీడర్ల కోసం 14-15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించాం.
రూ.10 కోట్లతో 35 పాఠశాలల్లో వివిధ అభివృద్ధి పనులు, ఎన్ఎఏసీ భవనంలో మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించుకున్నాం.రూ.2 కోట్లతో స్థానిక ఉత్పత్తులను విక్రయించుకునేలా ఆధునిక రైతు బజార్ నిర్మిస్తాం. రూ.13 కోట్ల వ్యయంతో కుప్పం ఆర్డీఓ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయాలను కూడా నిర్మిస్తున్నాం. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రూ.15 కోట్ల వ్యయంతో చేపడతాం.రూ.8 కోట్ల వ్యయంతో కుప్పం మున్సిపాలిటీ పరిధిలో హైమాస్ట్ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మున్సిపాలిటీ పరిధిలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం కూడా పూర్తి చేస్తున్నాం.రూ.184 కోట్ల వ్యయంతో మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ యుటిలిటీని నిర్మించాలని నిర్ణయించాం. హంద్రీనీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా బీరువాని పల్లె వద్ద రూ.45 కోట్లతో ఓ రిజర్వాయర్ నిర్మిస్తాం.మల్లనూరు దగ్గర రూ.27 కోట్ల వ్యయంతో ఓ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తాం. రూ. 16 కోట్ల వ్యయంతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మించేలా, హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్ట్రర్ ఏర్పాటు చేయబోతున్నాం.కుప్పం మార్కెట్ యార్డులో రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశాం.రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు డిజిటల్ లిటరసీతో పాటు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా శిక్షణ అందిస్తున్నాం.కుప్పంలోనూ 8500 మంది మహిళలకు శిక్షణ అందుతోంది.కుప్పంలో 32 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రెండేళ్లలో పరిశ్రమలు, అనుబంధ కార్యక్రమాలతో యువతకు ఉద్యోగాలు ఉపాధి వచ్చింది.స్థానికంగా వచ్చిన పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం బిర్లా ఇనిస్టిట్యూట్ ఇప్పటికే నైపుణ్య శిక్షణ ఇస్తోంది. మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తాం. దాదర్- పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు ఇవాళ్టి నుంచి కుప్పం రైల్వే స్టేషనులో ఆగుతుంది. కుప్పాన్ని అనుసంధానిస్తూ బెంగుళూరు, చైన్నై, కేజీఎఫ్, కృష్ణగిరి లాంటి ప్రాంతాలను అనుసంధానించేలా జాతీయ రహదారులు వస్తున్నాయి.కుప్పం- పొగురుపల్లి నుంచి బెంగుళూరుకు ఓ ప్రత్యామ్నాయ రహదారిని కూడా నిర్మిస్తున్నాం. చిత్తూరు నుంచి కుప్పానికి బ్రాడ్ గేజ్ లైన్ కనెక్ట్ చేయాలని రైల్వేశాఖ మంత్రిని కోరాను.
కుప్పంలో ఉత్పత్తి చేసిన వస్తువులు కృష్ణపట్నం పోర్టుకు చేరేలా ఈ కనెక్టివిటీని పెంచుతున్నాం.త్వరలోనే కుప్పంలో ఎయిర్ పోర్టును కూడా ఏర్పాటు చేస్తాం. మొత్తంగా స్వర్ణ కుప్పంగా ఈ నియోజకవర్గాన్ని మారుస్తాం.
నియోజకవర్గంలో ప్రతీ ఇంటిపైనా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం. 8,904 బంగారు కుటుంబాలను గుర్తించి వారికి పీ4 కార్యక్రమం ద్వారా సహకారం అందిస్తున్నాం. కుప్పాన్ని పేదరికం లేని నియోజకవర్గంగా మార్చటమే నా లక్ష్యం.కుప్పంలో ఎక్కడా చెత్త కనిపించకుండా చేయాలన్నది మా ఆలోచన. 82 ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా కుప్పంలో చెత్త నుంచి కాంపోస్టు తయారు చేయిస్తున్నాం.నెట్ జీరో కుప్పంగా ఈ నియోజకవర్గాన్ని తయారు చేస్తాం.ఆస్పత్రి, కాలేజి, పాఠశాల, ప్రభుత్వ కార్యాలయం ఇలా అన్నీ నెట్ జీరో కావాలి.
సోలార్ రూఫ్ టాప్ తో ప్రతీ ఇల్లూ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలి. సంజీవని ప్రాజెక్టులో భాగంగా పౌరుల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నాం. ఇదో గేమ్ ఛేంజర్.
అందరి ఆరోగ్యాన్ని పరీక్షించేలా సంజీవని ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాం.కుప్పంలో ఇప్పటికే వివిధ రకాల పరీక్షలను నిర్వహించి డిజిటల్ హెల్త్ రికార్డులను నమోదు చేసి చికిత్సలు అందిస్తున్నాం.13 పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులతో 1.29 లక్షల మందికి కుప్పంలో సేవలు అందిస్తున్నాం.ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆరోగ్యాన్ని పరిరక్షించేలా చర్యలు చేపడుతున్నాం. శ్రీవాణి ట్రస్టు రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల దేవాలయాల నిర్మాణాన్ని చేపడుతున్నాం. కుప్పంలోనూ ఓ ఆలయాన్ని నిర్మిస్తాం. అర్హులందరికీ ఇళ్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
పేదలకు పట్టాభిషేకం పేరుతో ఇల్లు – ఇంటి జాగా ఇచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నాం.
కంగుందిలో దశాబ్దాల పాటు పరిష్కారం కాని భూ సమస్యను పరిష్కరించి 320 మందికి పట్టాలు ఇచ్చాం.రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో మీ భూమి- మీ హక్కు పేరిట రాజ ముద్రతో కూడిన పట్టాలు జారీ చేస్తున్నామన్నారు.
అమరావతిని స్మశానం అని నిందించారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతుంటే చూడలేక కుట్రలకు పాల్పడుతున్నారు.ధైర్యం ఉంటే జే బ్రాండ్స్ పై సమాధానం చెప్పాలి, ఏపీపీఎస్సీ అవకతవకలపై సమాధానం చెప్పాలన్నారు.డీఎస్సీ నియామకాలపై రౌడీయిజం చేస్తానంటే చూస్తూ ఊరుకోం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా స్థానం ఇవ్వకుండా గొడ్డలి పార్టీకి గట్టి సమాధానం ఇవ్వాలి. ప్రతీ వార్డులో, ప్రతీ పంచాయితీలో కూటమి అభ్యర్ధులే గెలవాలి. అదే అభివృద్ధికి నిజమైన సూచిక.
మత మార్పిడులు చేసే పార్టీ, రౌడీలను పెంచి పోషించే గొడ్డలి పార్టీని తరిమి కొట్టండి.
రాష్ట్రంలో రాజకీయ ముసుగులో రౌడీ అనే వాళ్లు ఉండడానికి వీల్లేదు. కుప్పం నుంచే ఆ ఆ ప్రక్రియ మొదలు కావాలి.డీఎస్సీ ఉద్యోగాలు తమ కష్టార్జితమని టీచర్లంతా నినదిస్తున్నారు. ఫేక్ పార్టీ అందరినీ ఫేక్ అంటే సహించేది లేదని విజయవాడలో స్పోర్ట్స్ టీచర్లు ఆందోళన చేస్తున్నారు.
ఇవాళ విజయవాడలో రౌడీలు గురువులపై దాడి చేస్తున్నారు.
టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. చర్యలు తీసుకుంటాం.
సీబీఎన్ జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లలో అవినీతే జరగదు. నా హాయంలో ఎప్పుడూ పేపర్ లీక్ కాలేదు.
సీబీఎన్ పాలనలో టీచర్ల రిక్రూట్మెంట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఇదీ మన ట్రాక్ రికార్డ్.
• నియామకాలు జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు లేనిపోని దుష్ప్రచారం చేస్తూ బురద జల్లుతున్నారు.కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం, విశాఖలో సముద్రం ఒడ్డున దుష్ప్రచారాన్ని తిప్పడికొడుతూ టీచర్లు గర్జించారు.ఫేక్ పేపర్ సాక్షికి చెందిన రిపోర్టర్ ఓ ఉపాధ్యాయుడిపై దాడి చేశారంటే వైసీపీ మూకలు ఎంతకు బరితెగించాయో అర్థం చేసుకోండి.ఇలాంటి వాళ్లను ఇంకా ఉపేక్షించాలా..? వీరిలాగే కొనసాగితే ఆస్తులకు ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందా..?అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే సాక్ష్యాధారాలతో చూపించి వారి నోళ్లూ మూయిస్తాం.చట్టబద్దంగా జరిగిన ప్రక్రియపై అవసరమైతే కోర్టులకు వెళ్లొచ్చు. కానీ దాడులేంటీ…?ఉపాధ్యాయులపై రౌడీలను ఎగదొయడమేంటీ..?
2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. రాష్ట్రానికి అది మామూలు నష్టం కాదు.
నాటి పాలనలో పాలకులే రౌడీయిజం చేశారు,దారుణాలకు పాల్పడ్డారు.కుప్పం వస్తే నన్ను కూడా ఇబ్బందులు పెట్టారు. దౌర్జన్యాలకు దిగారు.
ఓడిపోయిన తర్వాత కూడా చంపడానికైనా చావడానికైనా సిద్దం అంటూ రౌడీయిజం చేస్తున్నారు.రౌడియిజం చేసే వారి తోక కత్తిరిస్తాం. రౌడీలను విధ్వంసకారులను తరిమి కొట్టే సత్తా కుప్పానికి ఉంది.ఫ్లెక్సీలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రక్తాభిషేకం చేస్తున్న వారిని సైకోలు అనాలా,మానసిక రోగులు అనాలా అన్నారు. తిరుమల పవిత్ర లడ్డూను కూడా కల్తీ చేశారు.ప్రతీ ఎన్నికలోనూ సైకిల్ గుర్తుకు మాత్రమే ఓటేసి మద్దతిచ్చిన నియోజకవర్గాలు ఒకటి కుప్పం, రెండోది హిందుపూర్ అన్నారు. కుప్పం బహిరంగ సభలో వివిధ రైతులు, గృహిణులు, ఉద్యోగులు, యువత, వివిధ పథకాల లబ్దిదారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.హంద్రీనీవా కాలువ ద్వారా లబ్ది ఎలా ఉందంటూ ఓ రైతును అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి.అధికంగా రసాయన ఎరువులతో కలుషితం చేసేలా సాగు చేయవద్దని సీఎం హితవు.
వాతావరణ సమతుల్యం దెబ్బతిన్న కారణంగా ఎల్ నినో లాంటి పరిస్థితులు వచ్చాయని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. వర్షాభావ పరిస్థితులతో కృష్ణా, గోదావరి నదులకు నీరు రాకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని వెల్లడి. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా బయో డైవర్సిటీ తెచ్చి మళ్లీ పర్యావరణ పరిరక్షణ చేపట్టేలా కృషి చేయాలన్న సీఎం.ప్రకృతి సేద్యమే శ్రీరామ రక్ష అనే విధానాన్ని పాటిద్దామని రైతులకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి.బయోచార్ లాంటి విధానాలతో భూమికి సారాన్ని, తేమను పెంచుదామని రైతులకు సీఎం సూచన. రాష్ట్రంలో 20 లక్షల మంది ప్రకృతి సేద్యం చేస్తున్నారని.. దీనిని మరింతగా పెంచాలన్న చంద్రబాబు.
రాష్ట్రవ్యాప్తంగా పీఎండీఎస్ విధానంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరిన ముఖ్యమంత్రి. భూములను ఖాళీగా ఉంచకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసి భూమిని పచ్చదనంగా ఉంచాలన్న సీఎం చంద్రబాబు.కరవు నివారణా కార్యక్రమాలతో దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తామని వెల్లడి.పీ4 కార్యక్రమం ద్వారా ఎలాంటి లబ్ది పొందారని లక్ష్మి అనే మహిళను అడిగిన ముఖ్యమంత్రి.ఇటుకల బట్టీ ఏర్పాటు చేసేందుకు సహకరించి తనను ఓ మహిళా పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దిన సీఎంకు, టీవీఎస్ సంస్థకు ధన్యవాదాలు తెలిపిన లబ్దిదారు లక్ష్మీ.ప్రతీ ఇంటికీ ఓ పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి.టీవీఎస్, అదానీ, మెగా లాంటి సంస్థలు 8900 మందిని దత్తత తీసుకుని బంగారు కుటుంబాలను ఆర్ధికంగా నిలబెడుతున్నాయని అభినందించిన సీఎం.కుప్పంలోని ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన సురేఖ అనే యువతిని అభినందించిన ముఖ్యమంత్రి.స్టార్టప్ కంపెనీలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలూ ప్రతీ కుటుంబంలోనూ తయారు కావాలని సీఎం ఆకాంక్ష.కుప్పం
కుప్పంలో జరిగిన అభివృద్ధితో తమకు కలిగిన లాభాలను, మేలును ముఖ్యమంత్రికి వివరించిన స్థానిక ప్రజలు. లబ్దిదారులు.కుప్పం మెడికల్ కాలేజీ తన తండ్రి ప్రాణాల్ని కాపాడిందని తెలిపిన యువ పారిశ్రామిక వేత్త సుబ్రహ్మణ్యం.
ప్రతీ రోడ్డు, ప్రతీ నీటి చుక్కలోనూ, కుప్పం అభివృద్ధిలో అడుగడుగునా సీఎం చంద్రబాబు కనపడుతున్నారని తెలిపిన కుప్పం యువకుడు. కుప్పంలో ఉత్పత్తి అవుతున్న ఆర్గానిక్ ఉత్పత్తులను ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నానని చెప్పిన యువకుడు. హంద్రీనీవా సుజల స్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా వచ్చిన నీటి ప్రవాహంపై బహిరంగ సభలో లైవ్ వీడియో ప్రదర్శన.కుప్పం బ్రాంచ్ కెనాల్ నుంచి కొందరు మహిళా రైతులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.కడా నిర్వహించిన కుప్పం అభివృద్ధి వీడియో కాంటెస్టులో విజేతలుగా నిలిచిన, సుబ్రహ్మణ్యం, విక్కీ అనే యువకుల్ని సత్కరించిన ముఖ్యమంత్రి.కుప్పం అభివృద్ధి గురించి వీడియోలో చక్కగా వివరించిన సుబ్రహ్మణ్యం, విక్కిలను అభినందించిన సీఎం. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ సురేష్ బాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమినేతలు, ప్రజలు పాల్గొన్నారు.