నాలుగు మండలాల యువతకు డ్రగ్స్, గంజాయి టెస్టులు.. నలుగురికి పాజిటివ్
-పుత్తూరు రూరల్ సీఐ రవీంద్ర పర్యవేక్షణలో డ్రగ్ డిటెక్టివ్ టెస్టులు పిచ్చాటూరు, జూన్ 23 గరుడధాత్రి: యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పుత్తూరు రూరల్ సీఐ రవీంద్ర ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం పిచ్చాటూరు, నారాయణవనం, వడమాలపేట, కెవిబిపురం మండలాలకు చెందిన 62 మంది యువకులకు డ్రగ్స్ మరియు గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సంబంధిత మండలాల ఎస్సైలు అందించిన సమాచారం మేరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు సీఐ రవీంద్ర వెల్లడించారు. ఈ...