నిడిగుంట స్కూల్ 1985-86 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
పలమనేరు, ఆగస్టు 09 (గరుడ ధాత్రి ): గంగవరం ఫ్లైఓవర్ పక్కన ఉన్న మిలటరీ కమ్యూనిటీ హాల్‌లో నిడిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1985-86 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం కోలాహలంగా జరిగింది. దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ పాఠశాల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు ఐదు ఎకరాల స్థలాన్ని విరాళంగా అందించిన దాత వరదారెడ్డి విగ్రహాన్ని పాఠశాల ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని పూర్వ విద్యార్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. విగ్రహ ఏర్పాటుకు అవసరమైన...