నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించాలి – సీఐ గోపాల్‌రెడ్డి

వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి బి కొత్తకోట సెప్టెంబర్:4(గరుడ ధాత్రి న్యూస్) వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా,ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రతి వినాయక మండప నిర్వాహకుడు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని బి కొత్తకోట సీఐ గోపాల్‌రెడ్డి సూచించారు.మండపం ఏర్పాటు చేసే ముందు సంబంధిత శాఖల అనుమతులు పొందడం నిర్వాహకుల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వినాయక మండపాల అనుమతుల కోసం పోలీస్ శాఖ సింగిల్‌ విండో ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ ద్వారా...