GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 4:47 pm Digital Edition : GURU SWAMY

నిమ్మకాయల వీధిలో భక్తులకు అంబలి పంపిణీ..

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి సోదరిగా, తిరుపతి నగర ప్రజల గ్రామదేవతగా,పిలిస్తే పలికే తల్లిగా నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం చాటింపుతో ప్రారంభం కావడంతో బుధవారం నిమ్మకాయలవీధిలో భక్తులకు అంబిలి పంపిణీ కార్యక్రమానికి బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు మాజీ డైరెక్టర్ పి. భువన్ కుమార్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు వితరణ చేశారు.
ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని గత 25 సంవత్సరాలుగా నిమ్మకాయలవీధిలో మునస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నదని, ఈ సంవత్సరం మునస్వామి ఆకాల మరణంతో వారి సోదరి లలిత,నాగేశ్వరరావు, షణ్ముగం,నాగార్జున,దేవి,లక్ష్మి లతోపాటు నిమ్మకాయలవీధి, తీర్థకట్టవీధిలోని వ్యాపారస్తుల సహకారంతో ఏడు రోజులపాటు ప్రతిరోజు ఒక పూట గంగమ్మ తల్లికి నైవేద్యం పెట్టి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. అనంతరం టిడిపి నేత పి. భువన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
తాతయ్యగుంట గంగమ్మ తల్లి అనుగ్రహంతో తిరుపతి నగర ప్రజలతో పాటు అన్ని ప్రాంతాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని, ఎటువంటి అంటువ్యాధులు, విష జ్వరాలు నగరంలో ప్రబలకుండా ప్రజలంతా సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని గంగమ్మ తల్లికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఘనంగా పూజలు నిర్వహించారు!
ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారస్తులు నాగరాజు,శీను, అరవింద్,గుర్రప్ప,శివ, రూపేష్ పాల్గొన్నారు.