*10,060 పోస్టులకు జాబ్ క్యాలెండర్ 2026
కుప్పం,ఆగస్టు 23 గరుడధాత్రి న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందిస్తూ 10,060 పోస్టుల భర్తీకి ‘జాబ్ క్యాలెండర్ 2026’ కు ఆమోదం తెలిపింది. ఆర్ధిక శాఖ జీవో జారీ చేయగా, నాలుగు దశల్లో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తికానుంది. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులతో పాటు పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్థక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అలాగే డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులు పూర్తి నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ జీవో ఐఆర్ వెబ్సైట్ లేదా ఏపీపీఎస్సీ పోర్టల్ సందర్శించవచ్చు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది.