నీరువాయి గ్రామపంచాయతీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పిచ్చాటూరు ఆగస్టు 15 గరుడధాత్రి: మువ్వన్నెల జెండా రెపరెపలాడగా.. దేశభక్తి స్ఫూర్తితో పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామపంచాయతీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణంలో నిర్వహించిన వేడుకల్లో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ ఎంపీడీవో శ్రీ రవికుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. వెంకటరమణ స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వివరించారు. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో విద్యనభ్యసించి దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి...