GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 7:29 am Digital Edition : GURU SWAMY

నూతన తాహసీల్దార్ గా రమేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

పలమనేరు, సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి ) :

పలమనేరు మండలం నూతన తాహసీల్దార్ గా రమేష్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న ఇన్భనాథన్ దీర్ఘ కాలిక సెలవుపై వెళ్లడంతో కుప్పం ఆర్డివో కార్యాలయంలో డీటీగా పని చేస్తున్న రమేష్ రెడ్డి బదిలీ పై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తహసీల్దార్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ… సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. నూతన తహసీల్దార్ ను డిప్యూటీ తహసీల్దార్ తో పాటు ఆర్ఐలు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.