GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:16 am Digital Edition : GURU SWAMY

నెల్లిపట్ల లోని దేవరకొండ పై ఘనంగా శ్రీ సుబ్రమణ్య స్వామికిఆడికృత్తిక వేడుకలు

కన్నులపండువగా
శ్రీ వల్లి, దేవసేన సమేత
శ్రీ సుబ్రమణ్య స్వామి కల్యాణోత్సవం

భక్తులతో క్రిక్కిరిసిన దేవరకొండ

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు7

బైరెడ్డిపల్లి మండలంలోని నెల్లిపట్ల దేవరకొండ పై వెలిసివున్న
శ్రీ వల్లి, దేవసేన సమేత
శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో శుక్రవారం ఆడికృతిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామికి పంచామృత అభిషేకం చేపట్టి విశేష పూజలు చేపట్టారు.సాయంత్రం
శ్రీ వల్లి, దేవసేన సమేత
శ్రీ సుబ్రమణ్య స్వామీ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు ధరింపచేసి వివిధ ఆభరణాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం శ్రీ సుబ్రమణ్య స్వామి,ఉభయదేవేర్లు ను ప్రత్యేక వేదిక పై ఆశీనులుచేసిశాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణ ల మధ్య స్వామి చే ఉభయదేవేర్లు మెడలో మంగళ్యధారణచేయించికమనీయంగా కల్యాణం కొనసాగింది.అనంతరం ధోపోత్సవం,ఉంజలసేవ కార్యక్రమంలు భక్తుల కోలాహలం తో నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు హరోంహార అంటూ కృత్తికా కావాళ్ళు ను భక్తి శ్రద్దలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు.ఈ కార్యక్రమంకు
ఉభయ దార్లు,భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.నిర్వాహకులు దాతలు సహాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.