నెల్లిపట్ల లోని దేవరకొండ పై ఘనంగా శ్రీ సుబ్రమణ్య స్వామికిఆడికృత్తిక వేడుకలు
కన్నులపండువగా శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి కల్యాణోత్సవం భక్తులతో క్రిక్కిరిసిన దేవరకొండ బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు7 బైరెడ్డిపల్లి మండలంలోని నెల్లిపట్ల దేవరకొండ పై వెలిసివున్న శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో శుక్రవారం ఆడికృతిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామికి పంచామృత అభిషేకం చేపట్టి విశేష పూజలు చేపట్టారు.సాయంత్రం శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామీ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు ధరింపచేసి వివిధ ఆభరణాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు....