నెల్లిపట్ల లో ఘనంగా శ్రీ పెద్దపులి గంగమ్మ జాతర
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్7 బైరెడ్డిపల్లి మండలం లోని నెళ్లి గ్రామంలో శనివారం రాత్రి గ్రామ దేవత శ్రీ పెద్దపులి గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి శిరస్సు ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది గ్రామ పురవీధుల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పు వాయిద్యాలు,మంగళ వాయిద్యాలు,భక్తుల కోలాహలం మధ్య ఊరేగించారు. భక్తులు అమ్మవారికి మంగళహారతులు పట్టారు. ఆదివారం తెల్లవారుజామున గ్రామ సంతగేటు వద్ద ప్రతిష్టించారు. మండలంనుంది కాక,కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి...