నెల్లూరుకు కేంద్రం భారీ గిఫ్ట్‌…. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్….!

గరుడధాత్రి : విద్యా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు నెల్లూరు సిద్ధమైంది. దక్షిణాది రాష్ట్రాల విద్యా స్వరూపాన్నే మార్చేయగల అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ - RIE నెల్లూరులో ఏర్పాటు చేసే దిశగా కీలక అడుగు పడింది. ఈ ఇనిస్టిట్యూట్ ఎప్పుడో మంజూరైనా గత పాలకుల నిర్లక్ష్యం, రకరకాల అడ్డంకులతో మూలనపడింది. కూటమి ప్రభుత్వం చొరవతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. నిర్మాణ పనులను వేగంగా పట్టాలెక్కించేందుకు వీలుగా పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియ కూడా...